Mahanadu : పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజయం సాధించాం – చంద్రబాబు
Mahanadu : ఎన్నో అడ్డంకులు, రాజకీయ దాడులను ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ ప్రతిసారీ ప్రజల మద్దతుతో ముందుకు వచ్చిందని గుర్తుచేశారు
- By Sudheer Published Date - 04:25 PM, Tue - 27 May 25

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు (Mahanadu) ఈ సంవత్సరం కడప జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కడప నగరం పసుపు కండువాలతో ముస్తాబై పార్టీ అభిమానుల తాకిడి వల్ల కాంతులీనింది. మూడు రోజులపాటు జరిగే మహానాడు ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు. ముందస్తు ప్లాన్ ప్రకారం మొదటి రెండు రోజులు పలు అంశాలపై పార్టీ నాయకుల మధ్య చర్చలు జరుగుతుండగా, మూడవ రోజు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొంటున్నారు.
Raja Saab : పవన్ థియేటర్స్ లలో ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ !!
మహానాడు ప్రారంభ సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కార్యకర్తలకు ఉత్సాహభరిత సందేశం ఇచ్చారు. “ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని, తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం టీడీపీ పవిత్ర కర్తవ్యం ” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. యువత పార్టీకి విలువైన ఆస్తి అని, తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు ప్రజల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే బాధ్యతను తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారిని గర్వించేవాళ్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పార్టీ పనిచేస్తోందని అన్నారు.
Tata Motors : టాటా హారియర్ EV అనౌన్స్మెంట్ ముందు రోడ్డు పై ప్రయోగం
“పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజయం సాధించడమే తెలుగుదేశం ధర్మం” అని స్పష్టం చేశారు. ఎన్నో అడ్డంకులు, రాజకీయ దాడులను ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ ప్రతిసారీ ప్రజల మద్దతుతో ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. మహానాడు వేదికగా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, ప్రజల అభివృద్ధికి సంకల్పబద్ధంగా ముందుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందించబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.