HYD: ఫ్రీ హాలిమ్ ఘటనలో షాకిచ్చిన పోలీసులు..
- By Balu J Published Date - 04:54 PM, Wed - 13 March 24

HYD: హైదరాబాద్ లో ఫ్రీ హలీం అని అఫర్ పెట్టడంతో ఊహించనివిధంగా జనాలు వచ్చారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. అయితే మలక్ పేట ఫ్రీ హాలిమ్ హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ ని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు పల్లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మలక్ పేట ముసారం బాగ్ చౌరస్తా వద్ద ఫ్రీ హాలిమ్ అంటూ అజీబో హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ సోషల్ మీడియా లో ప్రమోట్ చేసారు. రంజాన్ మొదటి ఉపవాస రోజున తన హోటల్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియా మద్యమలలో సాయంత్రం 7గంటల నుండి 8గంటల వరకు ఫ్రీ హాలిమ్ అంటూ సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టారు.
ఫ్రీ హాలిమ్ అని సోషల్ మీడియాలలో వచ్చిన వీడియోలను స్పందిస్తూ వందలాది మంది యువత హోటల్ వద్ద కు చేరుకున్నారు. వందలాది మంది యువత రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు యువతను చెదరగొట్టి అజీబో హోటల్ ముసువేయించారు… ఓనర్ ను అరెస్ట్ చేసి నిందితుడు పై ఐపీసీ సెక్షన్ లు 341,290,188, 21/76 సిపి యాక్ట్ కింద బుక్ చేసి అరెస్ట్ చేశారు. ఇక రంజాన్ సమీపిస్తుండటంతో పలు హోటళ్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.