Nadendla Manohar:నాదెండ్ల మనోహర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ఆ పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేశ్ తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Author : Hashtag U
Date : 29-08-2022 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ఆ పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేశ్ తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న కోనేటి వెంకటరమణ అలియాస్ హరి రాయల్ పై దాడి నేపథ్యంలో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళ్తే… కడప జిల్లా సిద్ధవటంలో జనసేనాని పవన్ కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నేత కోనేటి వెంకటరమణ అలియాస్ హరి రాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా… నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆయనపై దాడి చేసి చొక్కా చింపి, చెప్పుతో కొట్టి అవమానపరిచారంటూ కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.