Hyderabad: వారం రోజులపాటు MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ రవాణా వ్యవస్థ MMTS రైళ్లను వారం రోజులపాటు రద్దు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 14 నుండి 20 వరకు
- By Praveen Aluthuru Published Date - 01:51 PM, Sun - 13 August 23

Hyderabad: హైదరాబాద్ రవాణా వ్యవస్థ MMTS రైళ్లను వారం రోజులపాటు రద్దు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 14 నుండి 20 వరకు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లలో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా కొన్ని MMTS రైళ్లను రద్దు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. రోజుకు వందలాది మంది ప్రయాణించే MMTS రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు.
వారం రోజులపాటు ఈ ప్రాంతాలలో MMTS రైళ్లు నడవవు.
రైలు నం. 47129, 47132, 47133, 47135, 47136, 47137 (లింగంపల్లి-హైదరాబాద్)
రైలు నెం. 47105, 47108, 47109, 47110, 47112, 47114 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నం. 47165, 47214, 47157 (ఉమ్దానగర్-లింగంపల్లి)
రైలు నెం. 47189, 47179 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47178, 47181 (లింగంపల్లి–ఉమ్దానగర్)
రైలు నెం. 47158, 47156 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నెం. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా)
Also Read: Missile Drones In Border : మిస్సైల్స్ ప్రయోగించగల డ్రోన్స్.. బార్డర్ లో భారత్ మోహరింపు