Plants in Space: మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం..!
అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలకు సవాళ్లను విసురుతున్నాయి.
- By Hashtag U Published Date - 05:38 PM, Wed - 27 April 22

అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలకు సవాళ్లను విసురుతున్నాయి. నిరంతరం కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ, ఏదో ఒక శేష ప్రశ్న మిగిలే ఉంటుంది. తాజాగా స్పేస్‌ఎక్స్ బుధవారం నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపింది. నాసా వ్యోమగాములు కెజెల్ లిండ్‌గ్రెన్, రాబర్ట్ హైన్స్, జెస్సికా వాట్కిన్స్‌తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి గురువారం రోదసిలోని అవుట్‌పోస్ట్ చేరనున్నారు.
వ్యోమగాములు ఈ సారి మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు పెంచబోతున్నారు , వాటికి సంబంధించిన వస్తువులను భూమి నుంచి తీసుకెళ్లారు. అంతరిక్షంలోనే మట్టి లేకుండానే ఉత్పత్తి చేయడం ఎలా అనే అంశంపై వారు రీసెర్చ్ చేయనున్నారు. రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. మట్టి లేకుండా మొక్కలను పెంచడానికి అవసరమైన పదార్థాలు కూడా వారితో పాటు ఉన్నాయి.
గురువారం స్పేస్ స్టేషన్‌తో డాకింగ్ చేసిన తర్వాత, నలుగురు సభ్యుల సిబ్బంది నేల లేకుండా మొక్కలను పెంచడానికి హైడ్రోపోనిక్ (ద్రవ-ఆధారిత). ఏరోపోనిక్ (గాలి ఆధారిత) సాంకేతికతలను కలిగి ఉన్న శాస్త్రీయ ప్రయోగాలను చేయనున్నారు. ప్రధానంగా నేల లేకుండా జీరో గ్రావిటీలో మొక్కలను పెంచడాన్ని ప్రదర్శించేందుకు నార్త్రోప్ గ్రుమ్మన్స్ కార్గో రీసప్లై మిషన్ (NG17) ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేయనున్నారు. XROOTSగా పిలువబడే ఈ వ్యోమగాముల బృందం మొక్కల పెరుగుదలను అంచనా వేయడానికి వీడియోలు, స్టిల్ ఫోటోలను ఉపయోగిస్తుంది.
భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహానికి వెళ్లే సిబ్బందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ ప్రయోగాలు దోహదపడుతాయి. అలాగే అంతరిక్షంలో వ్యోమగాములు కొన్ని వైద్య అధ్యయనాలు కూడా చేయనున్నారు. ముఖ్యంగా rHEALTH అనే ప్రయోగం ద్వారా ఫ్లో సైటోమెట్రీని ఉపయోగించి, జీవ కణాలపై ప్రత్యేక ప్రయోగాలను చేయనున్నారు. తద్వారా రక్త క్యాన్సర్ వంటి ఆరోగ్య రుగ్మతలను ముందుగానే తెలుసుకునేందుకు ఈ ప్రయోగాలు ఉపయోగ పడనున్నాయి.
Related News

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.