HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Leaders Criticize Revanth Reddy Dil Raju Ticket Hike

Deshapathi Srinivas : దిల్ రాజుపై దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Deshapathi Srinivas : తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు.

  • Author : Kavya Krishna Date : 09-01-2025 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deshapathi Srinivas
Deshapathi Srinivas

Deshapathi Srinivas : సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అంశంపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలను విస్మరించి, నిన్న తీసుకున్న నిర్ణయాలపై వారు సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనలు కేవలం మాయమాటలేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

గేమ్ చేంజర్ మినహాయింపులపై ప్రశ్నలు
గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతులపై బీఆర్ఎస్ నేత, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నలు వేశారు. “తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని అసెంబ్లీలో చెప్పారు. కానీ దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు ప్రత్యేక మినహాయింపులు ఎందుకు?” అని నిలదీశారు. ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీలు మాట తప్పినట్లే, సినిమా టికెట్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.

Nidhhi Agerwal : పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిర్యాదు
తెలంగాణ కల్చర్ అవమానించడంపై ఆగ్రహం
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎక్కడా పాల్గొనలేదని, తెలంగాణ ప్రజలకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదని” స్పష్టంగా చెప్పారు. ఇటీవల నిజామాబాద్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కల్చర్‌ను అవమానించేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. “తెలంగాణలో వైబ్ లేదని, ఆంధ్రాలో మాత్రం సినిమాలకు మంచి వాతావరణం ఉందని చెప్పడం, ఇక్కడి ప్రజల గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం” అన్నారు.

తెలంగాణలో సినిమాలు విడుదల చేయడం మానుకోవాలని దిల్ రాజుకు హితవు పలికిన దేశపతి శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి టికెట్ల రేట్లు పెంచడానికి దిల్ రాజుకు అనుకూలంగా ఆదేశాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని మరోసారి బయటపెట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. “ప్రజల సమస్యలను దూరం చేసి, తప్పుడు రాజకీయాలకు సమయాన్ని వృథా చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని నేతలు వ్యాఖ్యానించారు.

YS Jagan London Tour : జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefit Shows
  • brs
  • Deshapati Srinivas
  • dil raju
  • Game Changer movie
  • Rasamayi Balakishan
  • revanth reddy
  • telangana culture
  • telangana politics
  • Ticket Price Hike

Related News

Ktr

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ ‘రైతు సంగ్రామ సదస్సు’ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీ

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd