Virgin Story: “వర్జిన్ స్టోరి” రిలీజ్ కు రెడీ!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".
- By Balu J Published Date - 12:13 PM, Fri - 11 February 22
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ఈ యంగ్ టాలెంట్ “వర్జిన్ స్టోరి” చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష
శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. “వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల
ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్రోకెన్ లవ్ పాటను విడుదల చేశారు.
అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన బ్రోకెన్ లవ్ పాటకు అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా హారికా నారాయణ్ పాడారు. ప్రేమికుడు దూరమైన సందర్భంలో నాయిక పాడుకునే సాడ్ సాంగ్ ఇది. ఏమో ఏమో అనుకోవడం, ఏదో ఏదో అయిపోవడం, ఏమో ఏమో ఏం చేయడం, ఎన్నో ప్రశ్నలైందే ఒక జీవితం. అంటూ సాగుతుందీ పాట. మ్యూజిక్ పరంగా “వర్జిన్ స్టోరి” మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటిదాకా
విడుదలైన పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా బ్రోకెన్ లవ్ కూడా యూత్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంది. టీజర్ , ట్రైలర్ తో పాటు ఈ ఛాట్ బస్టర్ సాంగ్స్ సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి.
విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాఘవేంద్ర,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.
Related News
Swayambhu: నిఖిల్ సినిమాలో ఒక్క ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు
Swayambhu: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రముఖ తారాగణంతో ఓ ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. వియత్నాం ఫైటర్స్ సహా 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్లో నిఖిల్ కొన్ని అద్భుతమై�