వామ్మో.. ఇదేం కాంట్రాక్ట్ బాబోయ్.. ప్రతిరోజు చీర కట్టుకోవాల్సిందే.. జిమ్ చెయ్యాల్సిందే!
సాధారణంగా పెళ్లి అంటే వధువుకీ వంట వండడం వచ్చా, ఏమైనా చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా, కట్నం ఎంత
- By Nakshatra Published Date - 10:45 AM, Sat - 16 July 22
సాధారణంగా పెళ్లి అంటే వధువుకీ వంట వండడం వచ్చా, ఏమైనా చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా, కట్నం ఎంత ఇస్తారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. వరుడుకి అయితే ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, ఉద్యోగం, సొంత ఇల్లు ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎన్నో ప్రశ్నలు ఎన్నో సమాధానాలు తెలిసిన తర్వాతే పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటారు. అయితే ఒక వధువు వరులు మాత్రం తినే ఫుడ్ నుంచి కట్టుకుని చీర వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా కండిషన్స్ పెట్టుకున్నారు. వధువు వరుడు వారిద్దరి చేసుకున్న కాంట్రాక్ట్ అది. పూర్తి వివరాల్లోకి వెళితే..
15 రోజులకు ఒకసారి మాత్రమే షాపింగ్ చేయాలి.. అదేవిధంగా నెలకు ఒకసారి మాత్రమే పిజ్జా తినాలి.. ప్రతిరోజు ఇంట్లో ఉండిన వంటలే తినాలి.. అలాగే ప్రతిరోజు జిమ్ కు వెళ్లాలి.. ప్రతిరోజు కూడా చీర కట్టుకోవాలి.. అయితే ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇవన్నీ న్యూ ఇయర్ రెజెల్యూషన్స్ కాదండోయ్ పెళ్లి సందర్భంగా వధువు వరులు చేసుకున్నా కాంట్రాక్ట్ కు సంబంధించిన నిబంధనలు. అస్సాం కి చెందిన శాంతి, మింటూ జంట తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యియ్యింది. ఇదే ఆ జంట పెళ్లి సందర్భంగా కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నారు.
పెళ్లి తర్వాత జీవితాన్ని ఎలా కొనసాగించాలి అన్న విషయాన్ని ముందుగానే హామ పత్రం ద్వారా రాసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులు కాంటాక్ట్ పేపర్ పై సంతకం పెడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ కాంట్రాక్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వెడ్డింగ్ కాంట్రాక్ట్ బాగుంది అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా, కొందరు మాత్రం అది పెళ్లి కాదు బిజినెస్ డీల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు అయితే ప్రతిరోజు చీర మాత్రమే కట్టుకోవాలి అనడం చాలా దారుణం అంటూ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్క నెటిజన్ వాళ్లకి తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే భారత్ లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి అనడానికి ఈ పెళ్లి ఒక ఉదాహరణ అని మరొకరి పేర్కొన్నారు. మొత్తానికి ఈ వెడ్డింగ్ కాంట్రాక్ట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.