Brahmastra: బ్రహ్మాస్త్ర బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కు బ్రేక్..!!
అలియా భట్ , రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది.
- By hashtagu Published Date - 09:54 AM, Fri - 16 September 22

అలియా భట్ , రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. సెప్టెంబర్ 9న రిలీజ్ అయిన ఈ మూవీ 6 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 160 కోట్ల మార్క్‌ను దాటింది. అయితే నాలుగో వారం నుంచి కలెక్షన్లు పూర్తిగా తగ్గాయి. దీంతో కరణ్ జోహార్, దర్శకుడు అయాన్ ముఖర్జీలకు టెన్షన్ పట్టుకుంది. ఈ వారం పది కోట్ల కంటే తక్కువగా కలెక్షన్లు వచ్చాయి.
‘బ్రహ్మాస్త్ర’ విడుదలై ఇవాళ్టికి 7 రోజులైంది. మొదటి రోజు 36.42 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు జంప్ చేసి 42.41 కోట్లు రాబట్టింది. వీకెండ్ లో 45.66 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా తగ్గాయి. మంగళవారం 14 కోట్లకు చేరుకుంది. బుధవారం 11 కోట్లు… మూడు రోజుల్లో, బాక్సాఫీస్ వద్ద ఈ గణాంకాలు భారీగా పడిపోయాయి. గురువారం 9 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే వారం రోజుల్లో సినిమా కలెక్షన్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్ 173.20 కోట్లకు చేరుకుంది.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాత్రం త్వరలోనే 200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో బ్రహ్మాస్త్ర బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలిచింది. బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్స్ మాత్రం మంచి ట్రెండ్స్‌ని చూపుతున్నాయి. ఈ సినిమా భవిష్యత్తు ఇప్పుడు వీకెండ్ కలెక్షన్‌ని నిర్ణయిస్తుంది, అయితే శని ఆదివారాలకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విపరీతంగా పెరిగిపోయాయి.