HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Boy Attempt Suicide In Girl Pregnancy Case In Kurnool

Kurnool: యువతీ గర్భంతో తనకు సంబంధం లేదన్న యువకుడు.. యువతి చేసిన పనికి చివరికి అలా?

ప్రస్తుత రోజుల్లో యువత చాలా మంది ప్రేమ పేరుతో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ చెక్క పట్టాలేసుకొని తిరగడం పెళ్లికి

  • Author : Anshu Date : 04-06-2023 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kurnool
Kurnool

ప్రస్తుత రోజుల్లో యువత చాలా మంది ప్రేమ పేరుతో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ చెక్క పట్టాలేసుకొని తిరగడం పెళ్లికి ముందే గర్భం దాల్చడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది బరితెగించిన యువత ప్రెగ్నెన్సీ రాగానే ఇంట్లో వాళ్లకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూడా ఇటువంటి ఘటనే ఒకటి ఏపీలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన హనుమంతుడు అని యువకుడు మల్లనహట్టికు చెందిన ఒక యువతిని ప్రేమించాడు.

వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని చెట్టాపట్టాలేసుకుని తిరిగి శారీరకంగా కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. కానీ హనుమంతుడు మాత్రం ఆ యువతి గర్భానికి తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ యువతీకి షాక్ ఇచ్చాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. హనుమంతుడు వల్ల తాను గర్భవతిని అయ్యానని కానీ ఇప్పుడు అతను ముఖం చాటేస్తున్నాడు తనకు న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని పిలిపించి విచారించగా తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలి అంటే డిఎన్ఏ టెస్ట్ కు కూడా తన సిద్ధమే అంటూ తెగేసి చెప్పాడు హనుమంతుడు.

దాంతో పోలీసులకు ఏం చేయాలో పాలు పోలేదు. మరోవైపు యువతి మాత్రం తరచూ హనుమంతుడికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టింది. నీవల్లే గర్భవతి అయ్యాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రి హనుమంతుడిని తరచూ వేధిస్తూ వచ్చింది. కానీ హనుమంతుడు మాత్రం అందుకు నిరాకరిస్తూ వచ్చాడు. కానీ ఆ యువతీ వినకుండా అలాగే వేధిస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు సంబంధం లేకపోయినా తన వల్లే గర్భం వచ్చింది అంటూ యువతి తనను వేధిస్తోందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • girl pregnancy
  • kurnool
  • Kurnool pregnancy
  • suicide

Related News

Loan App Harassment Kakinada

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

MBA Student Suicide  లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ క

  • Ap Police Recruitment

    APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd