Book Festival : విజయవాడలో బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన గవర్నర్ హరిచందన్
విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్‌ని గవర్నర్ హరిచందన్
- By Prasad Published Date - 06:58 AM, Fri - 10 February 23

విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్‌ని గవర్నర్ హరిచందన్ ప్రారంభించారు. మాతృభాషను ప్రేమించేలా విద్యార్ధులను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. మాతృభాష మాధ్యమంగా సాగే సంభాషణలు, రచనలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయన్నారు. మాతృభాషపై ప్రేమ, అభిరుచి పెంపొందించడానికి పుస్తకాలు ఉత్తమ సాధనమన్నారు. మాతృభాషలోని పుస్తకాల నుండి గొప్ప ఇతిహాసాలు, నీతి కథలను చదవమని ప్రోత్సహించిన తన చిన్ననాటి రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 81 మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతుంటే, దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు నాల్గవదన్నారు.