Bombay HC: వరవరరావుకు శాశ్వాత బెయిల్ కొట్టివేత!
అనారోగ్యం, ముంబైలో అధిక ఖర్చుల విషయమై హైదరాబాద్‌కు మారడానికి అనుమతి, శాశ్వత మెడికల్ బెయిల్ కోసం వరవరరావు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
- By hashtagu Published Date - 03:25 PM, Wed - 13 April 22

అనారోగ్యం, ముంబైలో అధిక ఖర్చుల విషయమై హైదరాబాద్‌కు మారడానికి అనుమతి, శాశ్వత మెడికల్ బెయిల్ కోసం ఎల్గార్ పరిషత్ నిందితుడు వరవరరావు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే, క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునేందుకు రావుకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను మూడు నెలలు పొడిగించింది. జస్టిస్ సునీల్ బి శుక్రే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మహారాష్ట్ర ప్రిజన్స్ హాస్పిటల్ రూల్స్, 1970 ప్రకారం మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది నియామకంపై తలోజా అన్ని జైళ్ల నుండి సమాచారాన్ని సేకరించి, తన స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని మహారాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైళ్లు)ని ఆదేశించింది. విచారణను వేగవంతం చేయాలని, రోజువారీ ప్రాతిపదికన నిర్వహించాలని ప్రత్యేక NIA కోర్టును బెంచ్ ఆదేశించింది. కాగా గతేడాది ఫిబ్రవరి 22న ఆరోగ్య కారణాలతో రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో వరవరరావు శాశ్వాత బెయిల్ కోసం వేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది.