Bihar CM:బీహార్ సీఎం ‘జనసభ’ దగ్గర పేలుడు.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నలందలోని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 'జనసభ' సైట్‌లో ఓ వ్యక్తి బాణసంచా పేల్చాడు. జనసభలో ప్రసంగించేందుకు నితీష్ కుమార్ సిలావ్ చేరుకున్నారు.
- By Hashtag U Published Date - 07:02 PM, Tue - 12 April 22
నలందలోని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనసభ’ సైట్‌లో ఓ వ్యక్తి బాణసంచా పేల్చాడు. జనసభలో ప్రసంగించేందుకు నితీష్ కుమార్ సిలావ్ చేరుకున్నారు. అక్కడ సమావేశ స్థలంలో ఒక వ్యక్తి పటాకుల లోపలకు తీసుకు వచ్చి పేల్చడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. నితీశ్ కుమార్ కూర్చున్న స్టేజీకి 15-18 అడుగుల దూరంలోనే క్రాకర్ పేలింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
#NITISHKUMAR की सुरक्षा में एक बार फिर चूक, नालन्दा के सिलाव में कार्यक्रम स्थल से 15-20 फीट की दूरी पर ब्लास्ट, हिरासत में लिया गया एक शख्स.युवक के पास से पटाखा और माचिस की तीली हुआ बरामद pic.twitter.com/w18Bh9UGUO
— Ashwani pathak (@AsvaniPathak) April 12, 2022
జన్ సంవద్ యాత్ర కోసం బీహార్ సీఎం నలంద పర్యటనలో ఉన్నారు. మంగళవారం (ఏప్రిల్ 12) పావాపురిలోని వర్ధమాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నితీష్ కుమార్ నానంద్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీవల భక్తియార్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో కూడా సీఎం నితీశ్ కుమార్‌కు భద్రతలోపం జరిగింది.
बिहार के माननीय मुख्यमंत्री पर फिर हमला करने का प्रयास किया गया है, बार-बार नीतीश जी की सुरक्षा में चूक होना चिंताजनक है।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) April 12, 2022