Gang Rape: నర్సుపై డాక్టర్ తో సహా సిబ్బంది అత్యాచారం, హత్య
బీహార్‌లో దారుణం జరిగింది. ఓ నర్సుపై డాక్టర్ తో సహా సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆ యువతిని హత్య చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 13-08-2023 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
Gang Rape: బీహార్‌లో దారుణం జరిగింది. ఓ నర్సుపై డాక్టర్ తో సహా సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆ యువతిని హత్య చేశారు. ముజఫర్‌పూర్‌లోని అంబులెన్స్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. బాధితురాలు ఓ వితంతువు అని, ఆమెకు నాలుగేళ్ళ కుమారుడు ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి ఒడిగట్టిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుడు డాక్టర్‌తో పాటు మరికొందరు పరారీలో ఉండగా పోలీసులు కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ జయప్రకాష్ దాస్ తన క్లినిక్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. తన కూతురు ఆగస్టు 8న నర్సింగ్‌హోమ్‌కు వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది. అనంతరం 80 కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. డాక్టర్ మరియు ఇతర నిందితుల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది.
Also Read: Telangana TDP: తెలంగాణ టీడీపీ బస్సు యాత్రలో చంద్రబాబు