Raghunandan Rao :హోం మినిస్టర్ మనవడి ఫొటోలు బయటపెడతా..!!
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ...జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Author : hashtagu
Date : 08-06-2022 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ…జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరో ఒత్తిడి చేస్తేనే జోయల్ డెవిస్ ప్రకటించారని రఘునందన్ అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో సీపీ ఆనంద్ చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.
ఇన్నోవా, బెంజ్ ల యజమానులు ఎవరంటూ ప్రశ్నించారు. ఇన్నోవా ప్రభుత్వం వాహనం అయితే డ్రైవర్ ఎందుకు లేడు…కొన్ని విషయాలు దాచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. దీనిపై ఎన్నో అనుమాలు ఉన్నాయన్నారు. హోం మంత్రి మనవడుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగితే తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
కాగా నిందితులకు శిక్ష పడుతుందని చెప్పడానికి సీపీ ఎవరంటూ ప్రశ్నించారు. నేను బయటపెట్టి ఫొటోల్లో ఉన్నవారు మైనర్లు, మేజర్ లా నాకెలా తెలుస్తుందని…విచారణలో తెలుస్తుందన్నారు. అందరూ మేజర్ ల లెక్కనే కనిపిస్తున్నారన్నారు. నిందితులే వీడియోలు బయట పెట్టుకున్నారని సీపీ చెప్పారు…మరి నామీద కేసు ఎక్కడిదన్నారు. వీడియోలు ఎవరు బయట పెట్టారు…ఆ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు…నోటీసులు ఇస్తే సమాధానం చెబుతానన్నారు. టీఆరెస్ కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి ముందుకు వెళ్లేందుకు ఈ కేసును వాడుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్…హిందువులకు ఒక న్యాయం…ముస్లింలకు ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు రఘునందన్ రావు.