Bilawal Bhutto: భారీ ఆఫర్ ప్రకటించిన బీజేపీ నేత.. భుట్టో తల తీసుకొస్తే రూ.2 కోట్లు అంటూ?
- By Anshu Published Date - 09:20 PM, Sun - 18 December 22

Bilawal Bhutto : తాజాగా బిలావల్ భుట్టో గుజరాత్ కసాయి ప్రధాన మోడీ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ పరువును భారత్ తీసిన విషయం తెలిసిందే. దీంతో అది తట్టుకోలేక బిలావల్ భుట్టో ఈ విధంగా వాఖ్యలు చేశారు. అయితే పాక్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే యూపీలో జరిగిన ఒక నిరసన సభలో ఒక బీజేపీ నాయకుడు విచిత్ర ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక్ విదేశాంగ మంత్రి భుట్టో తల తీసుకొస్తే రూ.2 కోట్ల రివార్డ్ ఇస్తానని యూపీ బీజేపీ నేత మనుపాల్ ప్రకటించారు. భుట్టో వ్యాఖ్యలకు బాగఫత్ జిల్లా పంచాయత్ కు చెందిన మనుపాల్ చేపట్టిన నిరసనలో భాగంగా ఈ ప్రకటనలు చేశారు. అయితే మనుపాల్ ఈ ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా మనుపాల్ భన్సల్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం అతను మాట్లాడుతూ మనం ఎంతో గౌరవించే ప్రధాని పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానిపై తమకు విపరీతమైన గౌరవం ఉందని ఆయన కోసం ఎటువంటి పనైనా చేస్తాము అని మునుపాల్ తెలిపారు. అలాగే తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీని కించపరిచే విధంగా వాఖ్యలు చేసినందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు వ్యతిరేకంగా భారత్ లోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు.