BJP: వైసీపీ ఉగ్రవాదపార్టీ.. ఏపీని తాలిబన్లు పాలిస్తున్నారు!
- By Balu J Published Date - 02:28 PM, Tue - 11 January 22

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని ఆయన ఆరోపించారు.ఏపీని తాలిబాన్లు పాలిస్తున్నారని.. వైసీపీ ఓ ఉగ్రవాద పార్టీ అని విమర్శించారు. వైసీపీ లో శిక్షణ పొందిన తాలిబన్లు తయారయ్యారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని.. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటనని ఆయన అన్నారు. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రికరిస్తున్నారని.. ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఈ ఘటనపై సీఎం జగన్, హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చెప్పారు. వైసీపీ కేంద్ర ఆఫీస్ సూచనాలతోనే ఆత్మకూరులో దాడులు, పోలీస్ స్టేషన్ పై దాడి, వాహనాలు దగ్ధం చేశారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరుకు వెళ్లకుండా ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నవాళ్ళు డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్, హఫీజ్ ఖాన్ ను ఎందుకు పంపారు అని ఆయన ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేయవద్దని డిప్యూటీ సీఎం సమక్షంలో శిల్ప చక్రపాణి రెడ్డి ఎలా కోరతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మకూరులో దాడి జరిగింది ఒక వ్యవస్థపైన….పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడంపై సీఎం, హోం మినిస్టర్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్, శిల్ప చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ పై కేసు నమోదు చేయాలని విష్ణు డిమాండ్ చేశారు.