Hyderabad: ఓయూ యూనివర్సిటీలో బర్తడే సెలబ్రేషన్స్ నిషేధం
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఆవరణలో పుట్టినరోజు వేడుకలు, పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని యాజమాన్యం నిషేదించింది.
- By Praveen Aluthuru Published Date - 04:31 PM, Sun - 24 September 23
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఆవరణలో పుట్టినరోజు వేడుకలు, పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని యాజమాన్యం నిషేదించింది. పరిశుభ్రత మరియు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. క్యాంపస్ ప్రాంగణంలో డైనమిక్ లైట్లను అమర్చిన తరువాత విద్యార్థులు క్యాంపస్‌లో మరియు బయట అర్థరాత్రి పుట్టినరోజు పార్టీలను జరుపుకోవడం గందరగోళానికి దారితీస్తుంది. విద్యార్థినుల భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ పోలీసులను కూడా ఆశ్రయించారు. కాగా సెప్టెంబర్ 12న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 12 కోట్ల రూపాయలతో ఓయూ క్యాంపస్ లో డైనమిక్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
Also Read:Andhra Pradesh: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం