Sajjala Ramakrishna Reddy : సజ్జలకు బిగ్ షాక్
Sajjala Ramakrishna Reddy : కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబానికి చెందినట్టు భావిస్తున్న 55 ఎకరాల అటవీ భూమి(55 acres of Forest Land)ని స్వాధీనం చేసుకోవాలని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది.
- Author : Sudheer
Date : 21-05-2025 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)కి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబానికి చెందినట్టు భావిస్తున్న 55 ఎకరాల అటవీ భూమి(55 acres of Forest Land)ని స్వాధీనం చేసుకోవాలని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములపై ఆక్రమణ జరిగిందని జిల్లా కలెక్టర్ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి, సంబంధిత అధికారులకు భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
BCCI Earnings: ఒక ఐపీఎల్ మ్యాచ్ ద్వారా బీసీసీఐ ఎంత సంపాదిస్తుంది అంటే?
ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రేపు అధికారుల బృందం ఆ ప్రాంతానికి వెళ్లి స్వాధీన ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ చర్యలతో ఒక్కసారిగా సజ్జల కుటుంబం షాక్ లో పడింది. ఇప్పటికే సజ్జల కుటుంబానికి ఆ ప్రాంతంలో సుమారు 146 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం ఉండటంతో, ఈ 55 ఎకరాల వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఈ భూములపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తే, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశమున్నది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.