HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bheemla Nayak Trailer Is A Treat

Bheemla Nayak: ‘పవన్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఓ రేంజ్ లో ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ …!!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న ఫిల్మ్ 'భీమ్లా నాయక్'. 'వకీల్ సాబ్' సినిమా తర్వాత వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్' కావడంతో... అంచనాలు ఆకాశాన్నంటాయి.

  • Author : Hashtag U Date : 05-02-2022 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’ కావడంతో… అంచనాలు ఆకాశాన్నంటాయి. ‘అయ్యప్పనుమ్ కోషియోమ్’ కి రిమేక్ గా ఈ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ కు పవన్ బెస్ట్ ఫ్రెండ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో శ్రద్దపెట్టి పవర్ స్టార్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మాటలు రాశారు. స్క్రీన్ ప్లే కూడా త్రివిక్రమే అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సింది.

కానీ అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాల కోసం పవన్ సినిమాను వాయిదా వేయాల్సిందిగా సదరు నిర్మాతలు కోరడంతో…. పెద్దమనుసు చేసుకుని, ఇండస్ట్రీ బాగుండాలని ‘భీమ్లా నాయక్’ ను వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే… తాజాగా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ గురించి సరికొత్త వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే… ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ డ్యూరేషన్ గురించే. పవన్ తాజా చిత్రం ట్రైలర్ నిడివి వచ్చి రెండు నిమిషాల 20 సెకండ్స్ ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కాగా, సినిమాలో హై ఎలివేషన్ షాట్స్ ను ట్రైలర్ లో చూపించనున్నారని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ లో పవన్, రానాల నటన ఓ లెవెల్ లో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సంగీతం, టైటిల్ సాంగ్ ఇప్పటికే దుమ్ముదులపడంతో… ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో ఫిబ్రవరి 25న కానీ, ఏప్రిల్ 1న కానీ విడుదల కానుంది. ‘భీమ్లా నాయక్’ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించబోతున్నాడని… కొత్త రికార్డులు నమోదుకావడం పక్కా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి భీమ్లా నాయక్ తో పవన్ ఎన్ని రికార్డులు కొల్లగొడతాడో అన్నది వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • Pawan Kalyan
  • trailer

Related News

Deputy CM Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

"డిప్యూటీ సీఎం" అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు

  • Ustaad Bhagat Singh

    ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • APs Development

    ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?

  • Chandrababu Pawan Kalyan

    తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

Latest News

  • అంబానీ దంపతులకు ఈడీ సమన్లు..పతనం అవుతున్న ‘రిలయన్స్’ షేర్లు!

  • క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!

  • అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి

  • వాహనదారులకు అలర్ట్ : మార్చి 1 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్

  • రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

Trending News

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd