Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా!
- By Balu J Published Date - 12:20 PM, Mon - 21 February 22

ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్ర గుండెపాటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ, టీడీపీ, ఇతర నాయకులు మేకపాటి గౌతంరెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. గౌతంరెడ్డి మరణవార్త కారణంగా ఇవాళ జరుగబోయే భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won’t be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
గౌతంరెడ్డి మృతికి సంతాప సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఇవాళ యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగాల్సి ఉంది. మేకపాటి మృతి కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో తేదీకి షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఏపీ సీఎం జగన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అచ్చెన్ననాయుడులు గౌతంరెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

274369972 5068645973167203 3486410549020272448 N