HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bheemla Nayak Craze Is On With Release Date Announced

Bheemla Nayak: వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

  • Author : Hashtag U Date : 16-02-2022 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bheemla
Bheemla

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…. మావాడు వస్తున్నాడు, ఇక కాచుకోండి అంటూ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుకు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మాత్రం ఇవే ట్రెండింగ్‌ గా మారాయి. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే… ఫిబ్రవరి 19న ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ విడుదల అవుతుందని. అలానే దీని నిడివి 2 నిమిషాల 25 సెకన్లు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ ట్రైలర్ మాత్రం మామూలుగా ఉండదట. గతంలో పవన్ ఫ్యాన్స్ ఎన్నడూ చూడని విధంగా పవర్ ప్యాక్డ్‌గా ఉంటుంది అని నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. నిజంగా అలానే ఉంటే ఇక పవన్ ఫ్యాన్స్ ను ఆపడం ఎవరితరం కాదనే చెప్పాలి.

ఇకపోతే, ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలకు అతి తక్కువ సమయం ఉండటంతో… ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చేస్తోంది చిత్రబృదం. మరోవైపు పవర్ స్టార్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తయింది. ఇక ట్రైలర్‌ రిలీజ్‌పై నిర్మాత, దర్శకులు దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఈనెల 19 ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కోసం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాత నాగవంశీ ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా యూసఫ్‌ గూడ లోని పోలీస్ గ్రౌండ్‌ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ఫిబ్రవరి 21న నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనుంది.

‘భీమ్లా నాయక్’ ఫీవర్ తెలంగాణ, ఏపీ, ఇండియాలోనే కాదు… ఓవర్సీస్ మార్కెట్‌ ను సైతం తాకింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అమెరికాలోని సినీ లాంజ్ థియేటర్ లో మొదటిరోజు ఏకంగా 13 షోలు ప్రదర్శిస్తున్నారంటేనే ‘భీమ్లా నాయక్’ ఫీవర్ అక్కడ ఎలా ఉందో మనం అర్దం చేసుకోవచ్చు. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన తొలి థియేటర్‌ గా సినీ లాంజ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ థియేటర్‌లో టికెట్ ధర 15, 20 డాలర్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇదే కాకుండా ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్ బోర్న్ తో పాటు న్యూజీలాండ్, గల్ఫ్ కంట్రీస్… ఇలా ఓవర్సీర్ మార్కెట్లో ఇప్పటినుంచే అడ్వాన్స్ బుకింగ్ ను స్టార్ట్ చేశారు. పవర్ స్టార్ స్టామినాకు తగ్గట్టుగా ఓవర్సీర్ మార్కెట్లో టికెట్లు తెగుతున్నాయి. ప్రీమియర్ షోల విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట.

మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా… పవన్ బెస్ట్ ఫ్రెండ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిచారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో నేపధ్యంలో తీసిని సినిమానే ‘భీమ్లా నాయక్’. పవన్ కు అపోజిట్ గా రానా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పనిచేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ తో పాత రికార్డులు కనమరుగవడం ఖాయం అన్నట్లు పవన్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. మరి ‘భీమ్లా నాయక్’ గా బాక్స్ ఆపీస్ వద్ద పవన్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో అన్నది వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • Pawan Kalyan
  • pre event
  • release date
  • trailer

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd