Bengaluru: అపద్దం ప్రాణాలైనా తీసేస్తుందంటే ఇదేనేమో.. 8 ఏళ్ల బాలిక చేసిన పనికి?
తాజాగా బెంగళూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక చెప్పిన ఒక అబద్ధం ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. చిన్న
- By Anshu Published Date - 07:05 PM, Fri - 16 June 23

తాజాగా బెంగళూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక చెప్పిన ఒక అబద్ధం ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. చిన్న అబద్ధంతో ఏకంగా అతని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 8 ఏళ్ల వయసు ఉన్న బాలిక ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడు అని అబద్ధం చెప్పింది. దాంతో కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు అపార్ట్మెంట్ లోని కొందరు ప్రజలు ఆ డెలివరీ బాయ్ ని దారుణంగా చితకబాదారు.
బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్ళినట్లు అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయింది. బాలిక తల్లిదండ్రులు కూడా ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ తనను అక్కడికి తీసుకెళ్లాడని తప్పించుకోవడానికి తన చేతిని కొరికాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఎవరు ఇలా చేశారని ప్రశ్నించగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ వైపు చూపించింది. దాంతో ఆ చిన్నారి మాటలు విన్న తల్లిదండ్రులు అపార్ట్మెంట్ వాసులు అతడిని దారుణంగా కొట్టారు. నిజం చెబుతున్నా వినిపించుకోకుండా ఆ గేట్లు మూసేసి మరి చితకబాదారు. ఇక ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనను పాప తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ గార్డ్ తో సహా అందరూ కొట్టారని ఆమె తప్పుగా తనను ఎందుకు ఇరికించిందో తెలియదు అనే ఫుడ్ ఏజెంట్ పోలీసులకు తెలిపాడు. తనను రక్షించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సదరు బాధితుడు కోలుకోవడానికి సదరు ఫుడ్ డెలివరీ సంస్థ అతనికి సెలవులు మంజూరు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆ బాలికను ప్రశ్నించగా క్లాస్ లో ఉన్న సమయంలో ఆడుకునేందుకు వెళ్లినందుకు తల్లిదండ్రులు కొడతారు అన్న భయంతో అలా చెప్పాను అని తెలిపింది. అసలు విషయం తెలుసుకున్న తర్వాత బాలిక తల్లిదండ్రులు అలాగే అపార్ట్మెంట్ వాసులు సదరు ఫుడ్ డెలివరీ బాయ్ కి క్షమాపణలు తెలిపారు.