BJP : బండి ‘నిరుద్యోగ దీక్ష’ ప్రారంభం.. హాజరైన బీజేపీ నేతలు!
- By Balu J Published Date - 01:07 PM, Mon - 27 December 21
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ప్రారంభించారు. కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన దీక్షకు నిరుద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బండికి మద్దతుగా దీక్షలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి, బిజెపి తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.