Bandi:ఇదేదో ముందే చేయోచ్చు కదా…ఢిల్లీలో దీక్ష ఎందుకు..!!
వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలుచేస్తామని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు.
- Author : Hashtag U
Date : 12-04-2022 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలుచేస్తామని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ దిగి వచ్చి ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ఏ లెక్క ప్రకారం రూ. 3వేల కోట్లు నష్టం వస్తుందని ముఖ్యమంత్రి చెబుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
తమపై దాడులు చేయించారని..అయినప్పటికీ తాము ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు. తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని FCI అధికారులు చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఎస్ పీ రూ. 1960 అని ప్రకటించింది కేంద్రమేనని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. ఇన్ని రోజులు తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Live : Addressing the Press Conference at BJP State Office. https://t.co/To0bGRZc0S
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 12, 2022