Pullela Gopichand Meets Amith Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో బ్యాడ్మింటన్ కోచ్ భేటీ
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మర్యాదపూర్వకంగా...
- By Prasad Published Date - 03:12 PM, Sat - 17 September 22

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. గోపిచంద్‌ను హైదరాబాద్‌లో కలవడం ఆనందంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, అమిత్ షాతో కేవలం క్రీడల గురించే మాట్లాడానని గోపిచంద్ వెల్లడించారు.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, జాతీయ బ్యాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలవడం ఆనందంగా ఉంది. pic.twitter.com/LAgtMVma0s
— Amit Shah (@AmitShah) September 17, 2022