Baby born: మధ్యప్రదేశ్‌లో వింతశిశువు జననం
- Author : HashtagU Desk
Date : 30-03-2022 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ఓ మహిళ రెండు తలలు, మూడు చేతుల కలిగిన బిడ్డకు జన్మనిచ్చింది. జావ్రా నివాసి షాహీన్ రెండు తలలు, మూడు చేతులతో కలిగి ఉన్న ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మూడవ చేయి రెండు ముఖాల మధ్య వెనుక వైపు ఉంది. చిన్నారిని రత్లామ్‌లోని SNCUలో కొంతకాలం ఉంచారు. అయితే అక్కడ నుండి ఇండోర్‌లోని MY హాస్పిటల్‌కు శిశువును రిఫర్ చేశారు.
సోనోగ్రఫీలో ఈ పాప కవలలా కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవేద్ ఖురేషీ తెలిపారు. చాలా మంది పిల్లలు కడుపులోనే చనిపోతారు లేదా పుట్టిన 48 గంటల్లోపే చనిపోతారని ఆయన తెలిపారు. అటువంటి సందర్భాలలో శస్త్రచికిత్స ఉన్నప్పటికీ.. ఇలాంటి పిల్లల్లో 60 నుంచి 70 శాతం మంది బతకడం లేదన్నారు. ప్రస్తుతం బిడ్డను ఇండోర్‌లోని ఎంవై హాస్పిటల్‌లోని ఐసియులో చేర్చగా, తల్లి రత్లామ్ ఆసుపత్రిలో ఉన్నారు.