Arvind Kejriwal: ఢిల్లీకి మీ సపోర్ట్ కావాలి !
ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:14 PM, Wed - 24 May 23

Arvind Kejriwal: ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ మేరకు బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్‌లను కలిశారు.
అంతకుముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేజ్రీవాల్‌కు మద్దతు పలికారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి మమతా ఇలా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుమారు గంటపాటు సమావేశం జరిగింది. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అయి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక సీబీఐ-ఈడీ వంటి సంస్థలతో బెదిరిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి బెంగాల్, పంజాబ్ మధ్య చాలా బలమైన సంబంధాలు ఉన్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘోరంగా ఫెయిల్ అయింది. రాష్ట్రంలో మరోసారి అధికారం తమదే అని ప్రచారం చేసుకున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. కర్ణాటక ఫలితాల తరువాత దేశంలోని బీజీపీయేతర పార్టీలు ఏకమవుతున్నాయి. దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత అవసరమని భావిస్తున్నారు. ఇప్పటికీ బీహార్ సీఎం నితీష్ విపక్షాల ఐక్యతకు ముందడుగేశారు. రెండురోజుల క్రితం నితీష్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.
Read More: Polavaram Finance : కేంద్ర ఆర్థిక సహాయం వెనుక `పోలవరం` కుట్ర

Related News

Rahul Kejriwal Meet : రాహుల్ గాంధీతో కేజ్రీవాల్ మీటింగ్.. దేనిపై అంటే ?
Rahul Kejriwal Meet : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.