New Election Commissioner : కొత్త ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్
భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ ఈ రోజు (సోమవారం) బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ...
- Author : Prasad
Date : 21-11-2022 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ ఈ రోజు (సోమవారం) బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేసిన తర్వాత రాజీవ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. 1985 బ్యాచ్‌కు చెందిన పంజాబ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయెల్‌ను నవంబర్ 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అపెక్స్ పోల్ బాడీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో గోయల్ చేరనున్నారు.