Holi: హోలీ ఆడుతున్నారా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కళ్లు సేఫ్
హోలీ పండుగ వచ్చేసింది. హోలీ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు అందరూ జరుపుకునే పండుగ. హోలీ ఆడుతూ ఎంతో సంతోషంగా, హాయిగా జరుపుకుంటారు. హోలీ అంటేనే రంగురంగుల పండుగ.
- By Nakshatra Published Date - 04:15 PM, Sun - 5 March 23

Holi: హోలీ పండుగ వచ్చేసింది. హోలీ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు అందరూ జరుపుకునే పండుగ. హోలీ ఆడుతూ ఎంతో సంతోషంగా, హాయిగా జరుపుకుంటారు. హోలీ అంటేనే రంగురంగుల పండుగ. రంగులు చల్లుకుంటూ, పూసుకుంటూ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రంగుల పండుగను ప్రతిఒక్కరూ జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటారు.
అయితే హోలీ జరుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రంగులు కళ్లల్లోకి వెళ్లడం వల్ల ప్రమాదం పొంచి ఉందే అవకాశం ఉంటుంది. కెమికల్స్ వల్ల తయారుచేసే రంగుల వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో రంగుల పండుగ జరుపుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన శరీరంలో కళ్లు అత్యంత సురక్షితమైనవ. దీంతో హోలీ ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సింథటిక్ రంగులు వాడకుండా సహాజసిద్దమైన రంగులను మాత్రమే వాడండి. సహాజసిద్దమైన రంగులు మార్కెట్లో లభిస్తున్నాయి. దీందతో వాటిని మాత్రమే వాడటం వల్ల కళ్లకు ఎలాంటి హాని ఉండదు. అలాగే ఇంట్లో కూడా రంగులు వాడుకోవచ్చు. అలాగే మెటల్ స్ప్రింకర్లు, పదునుగా ఉన్న పిచికారీలు ఉపయోగించకండి. అలాగే మహిళలు జుట్టును బ్యాండ్ తో టై చేసుకోవడం లేదా జడ వేసుకోవడం మంచిది. అలాగే రంగులు జుట్టు నుంచి కళ్లల్లోకి కారకుండా క్యాప్ ధరించడం మంచిది.
అంతేకాకుండా అలాగే రంగులు చల్లేటప్పుడు కళ్లు మూసుకోవడం మంచిది. అలాగే కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు హోలీ ఆడేటప్పుడు వాటిని తీసేయడం మంచిది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని హోలీ ఆడకూడదు. దీని వల్ల కళ్లు, లెన్స్ మధ్య రంగు ఇరుక్కుని ఇన్‌ఫెక్షన్‌కు దారతీయవచ్చు. ఇక కళ్లజోడు పెట్టుకుని హోలీ ఆడటం మంచిది. దీని వల్ల రంగు కళ్లల్లోకి వెళ్లదు.

Related News

TeamIndia Celebrates Holi: బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ వేడుకలు.. ఫోటోలు వైరల్..!
అహ్మదాబాద్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టు (TeamIndia) బిజీబిజీగా ఉంది. ఇండోర్లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే జట్టు మొత్తం తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతున్నారు. కాగా, టీమ్ బస్సులోనే ఆటగాళ్లు హోలీ (Holi) సంబరాలు చేసుకున్నారు.