Dating tips: అమ్మాయిలు మొదటిసారి మీ పార్ట్ నర్ తో డేట్ కు వెళ్తున్నారా…అయితే ఇవి గుర్తుంచుకోండి..?
అమ్మాయిలు, మీ పార్ట్ నర్ తో ఫస్ట్ టైం డేట్‌కి వెళుతున్నారా, అయితే జాగ్రత్త. డేటింగ్ కు ముందు మీలో చాలా రకాల గందరగోళం ఉంటుంది, ఎన్నో రకాల ప్రశ్నలు, కొంచెం నెర్వస్ నెస్ కూడా ఉంటాయి.
- By hashtagu Published Date - 05:42 PM, Tue - 7 June 22
అమ్మాయిలు, మీ పార్ట్ నర్ తో ఫస్ట్ టైం డేట్‌కి వెళుతున్నారా, అయితే జాగ్రత్త. డేటింగ్ కు ముందు మీలో చాలా రకాల గందరగోళం ఉంటుంది, ఎన్నో రకాల ప్రశ్నలు, కొంచెం నెర్వస్ నెస్ కూడా ఉంటాయి. డేటింగ్ సమయంలో ఏమి జరుగుతుంది? నేను అతన్ని ఇష్టపడతానా లేదా అతను వస్తాడా రాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. అదే సమయంలో, మొదటి సారి డేట్ కి వెళ్లే ముందు, భయాందోళనల మధ్య, తెలిసి లేదా తెలియక, చిన్న చిన్న తప్పులు చేస్తాము, ఇది చాలాసార్లు రిలేషన్ ఏర్పడకముందే విడిపోవడానికి కారణం అవుతుంది. అయితే డేటింగ్ కు పోయే ముందు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఎక్కడికి వెళుతున్నారో స్పష్టంగా తెలుసుకోండి…
మీ పార్ట్ నర్ తో మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నట్లయితే, మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ముందుగా మీ భాగస్వామిని అడగండి, అక్కడికి వెళ్లడానికి మీరు అసౌకర్యానికి గురి కాకూడదు. ఎందుకంటే నిర్మానుష్య ప్రదేశాలు, నగరానికి దూరంగా ఉండే ప్రాంతాలకు వెళితే మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది.
స్నేహంతో మాటను పెంచుకోండి –
మీకు నచ్చిన వ్యక్తితో మీ భావాలను పంచుకునే ముందు అతడితో స్నేహాన్ని మరచిపోకండి. ఇది కాకుండా, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించినట్లయితే, నేరుగా ప్రపోజ్ చేయకండి, మొదట స్నేహంలో మీ బంధం ఎలా ఉందో చూడండి.
తొందరపాటు, భయాందోళన –
మొదటి సారి డేట్‌కి వెళ్లడంపై మీలో భయం, సంకోచం ఉంటే వెంటనే చెప్పకండి. అలా చేస్తే మీ పార్ట్ నర్ కి అసౌకర్యంగా అనిపిస్తుంది. హడావిడిగా కాకుండా, మీ భావాలను అర్థం అయ్యేలా తెలపండి.
ప్రపోజ్ చేస్తున్నప్పుడు –
డేట్ కు వెళ్లే ముందు మీరు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటే, అప్పుడు మాత్రమే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకోండి. మీరు ప్రపోజ్ చేస్తుంటే మీ భాగస్వామికి నచ్చే పని చేయండి. ఒక వేళ మీరు ముందుగానే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుంటే, మీ ప్రపోజల్ చెప్పిన తర్వాత వారికి కొంత సమయం ఇవ్వండి. వాదించవద్దు లేదా బలవంతం చేయవద్దు.
ప్రదర్శించవద్దు –
చాలా మంది వ్యక్తులు తమ మొదటి డేట్ లోనే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేలా నటించడం ప్రారంభిస్తారు, అయితే ఇది సరైనది కాదు ఎందుకంటే అలా చేయడం వలన మీ సంబంధాన్ని మరింత దిగజార్చవచ్చు.
మీ భాగస్వామిని గౌరవించండి –
మీరు ఎవరితోనైనా మొదటి సారి డేట్ కి వెళుతున్నప్పుడు, వారి గౌరవం దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా ఎదుటి వ్యక్తికి ఇబ్బందిని కలిగిస్తాయి, వారి ఇష్టాలు మరియు అయిష్టాలను తెలుసుకోండి గౌరవించండి.
Tags
Related News
Thanvi Dola: ఏపీలో పేద బాలిక విద్యార్థులకు థాన్వి డోలా స్కాలర్షిప్
ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు థాన్వి డోలా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్లను ప్రకటించింది.