Ex MP Kothapalli Geetha : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. పీఎన్బీ నుంచి రూ.52 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో గీత
- Author : Prasad
Date : 14-09-2022 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. పీఎన్బీ నుంచి రూ.52 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో గీత అరెస్టయ్యారు. హైదరాబాద్‌లో గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనే అభియోగాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.