AP CM : ఇడుపులపాయకు చేరుకొని.. తండ్రికి నివాళులర్పించి!
- By Balu J Published Date - 12:34 PM, Fri - 24 December 21
కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మధ్యాహ్నానికి పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడ.. ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డుకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి.