CJI: ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్!
- By Balu J Published Date - 04:59 PM, Sat - 25 December 21

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటన ఉన్నారు. సతీసమేతంగా సొంతూరికి వెళ్లారు. పొన్నవరం ప్రజలు సీజీఐ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటుచేసిన ఆత్మీయ సభకు తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సీజేఐ ఎన్వీ రమణను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వం అధికారికంగా ఐటీ కార్యక్రమం ఏర్పాటుచేసింది. కాగా సొంతూరు పర్యటనలో సీజేఐకు అపూర్వ స్వాగతం లభించింది. తొలిసారిగా సీజేఐ హోదాలో రావడంతో ప్రజలు బ్రహ్మరథం పలికారు. అయితే దారిపొడవునా జగన్, రమణలతో కూడిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటుచేయడం అందర్నీ ఆకట్టుకుంది.