Miss Shetty Mr Polishetty: అనుష్క ఫ్యాన్స్ కు షాక్.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి వాయిదా
టాలీవుడ్ స్వీటీ అనుష్క సినిమాలు చేసి చాలా రోజులైంది.
- By Balu J Published Date - 05:27 PM, Wed - 26 July 23

టాలీవుడ్ స్వీటీ అనుష్క సినిమాలు చేసి చాలా రోజులైంది. ఆమె సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉంటుదన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి పక్కన నటిసుండటంతో ఫిదా అయ్యారు. “మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ దర్శకుడు మహేష్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ మంచి బజ్ ని సొంతం చేసుకుంది. పైగా అనుష్క ఫ్యాన్స్ అయితే ఎంతగానో తన రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఇప్పుడు మరికాస్త సమయం పట్టేలా ఉందని ఇప్పుడు తెలుస్తుంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 4న రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది. బహుశా ఈ చిత్రాన్ని మేకర్స్ అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం ఇపుడు సాధ్య పడేలా లేదు అని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందుకే సినిమా వాయిదా పడినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక మేకర్స్ త్వరలోనే కొత్త డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. అంతేకాదు ఇటీవల సినిమాల విడుదల తేదీ వాయిదా పడటం కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో భారీ బడ్జెట్ మూవీ సినిమా కూడా వాయిదా పడ్డ దాఖలాలున్నాయి. ఇక త్రివిక్రమ్, మహేశ్ కాంబో లో గుంటూరు కారం మూవీ కూడా వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read: AP Police: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారా, 2 వేలు ఫైన్ కట్టాల్సిందే!