Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి
కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.
- By Anusha Reddy Published Date - 08:20 PM, Sat - 25 March 23

కర్నాటకలో (Karnataka) మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (pm modi)పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది. మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దావణగెరెలో జరిగింది. రోడ్ షోలో వెళ్తున్న ప్రధానమంత్రి మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి తోసుకుంటూ వచ్చి ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు ప్రధాని కారు దగ్గరకు చేరుకోగానే…భద్రతా బలగాలు అతన్ని అడ్డుకున్నాయి.
VIDEO: पंतप्रधान मोदींच्या सुरक्षेत पुन्हा एकदा चूक, एक तरुण मोदींच्या दिशेनं धावत आला अन्…https://t.co/xspcfGyAF8
— Lokmat (@lokmat) March 25, 2023
అంతకుముందు జనవరిలో కర్నాటకలో హుబ్లీలో ప్రధానిమోదీ రోడ్ షో జరిగినప్పుడు కూడా ఓ చిన్నారి ప్రధానికి దగ్గరగా వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధాని మోదీకి పూలమాల వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఎస్పీజీ జవాన్లు పిల్లాడిని అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రధానమంత్రి భద్రతలోపాన్ని చూపాయి. అయితే కర్నాటక పోలీసులు దీనిని భద్రతాలోపంగా పేర్కొనలేదు.
Related News

Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్ఐఏ రైడ్స్
Plot To Kill Pm Modi : కర్ణాటకలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రైడ్స్ నిర్వహిస్తోంది.దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించిన 16 చోట్ల ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.