AP: మరోసారి కాపు నాయకుల సమావేశం.. త్వరలో ఐక్య వేదిక ఏర్పాటు?
ఏపీలో మరోసారి కాపు నాయకుల సమావేశం చర్చనీయాంశంగా మారింది.
- By Balu J Published Date - 11:06 AM, Mon - 24 January 22

ఏపీలో మరోసారి కాపు నాయకుల సమావేశం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం కాపు ముఖ్య నేతలంతా సమావేశం కాగా తాజగా మరోసారి ముఖ్యనేతలు వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపుగా 16 మంది నేతలు హాజరైయ్యారు. సుమారు రెండు గంటలు కాపు నేతల వర్చువల్ మీటింగ్ జరిగింది. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచించినట్లు సమాచారం. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో కాపు ముఖ్యనేతలు ఇప్పటికే టచ్ లో ఉన్నారు.
అయితే ఫిభ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా పలువురు కాపు నేతలు హాజరుకాగా.. సమావేశానికి వైసీపీలోని కాపు నేతలు దూరంగా ఉన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మోహాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.