Heart Stroke: మరో హార్ట్ స్ట్రోక్.. బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి
- By Balu J Published Date - 03:08 PM, Thu - 2 March 23

కరోనా తర్వాత చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? యువతకు హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల నందమూరి తారకరత్న గుండె సంబంధిత సమస్యతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త వినకముందే ఓ వ్యక్తి మరణించాడు. హైదరాబాద్‌లో 38 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ మరణించాడు. ఇండోర్ స్టేడియంలో ఆడుతుండగా శ్యామ్ యాదవ్ కుప్పకూలిపోయాడు. అతని మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.