HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another Attack On Tdp Office Tension In Gannavaram

Gannavaram: టీడీపీ ఆఫీసుపై మరోసారి దాడి.. గన్నవరంలో టెన్షన్‌ టెన్షన్‌!

కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి చేశారు.

  • By Anshu Published Date - 06:55 PM, Mon - 20 February 23
  • daily-hunt
Vallabhaneni Vamsi Gang Attacks Tdp Office
Vallabhaneni Vamsi Gang Attacks Tdp Office

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి చేశారు. ఆఫీసులోని అద్దాలు పగలగొట్టి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆందోళకారులు కారుకు నిప్పుపెట్టారు. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను చించివేసి విధ్వంసం సృష్టించారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్లను కూడా అడ్డుకున్నారు.

గన్నవరంలో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిమిషాల వ్యవధిలోనే టీడీపీ ఆఫీసుపై వైసీపీ వర్గీలు దాడి చేశారు. విధ్వంసం
సృష్టించారు. చాలా రోజులుగా ప్రశ్నాంతంగా ఉంటున్న గన్నవరం గడ్డపై… మరోసారి ఫ్యాక్షన్‌కు తెరలేచినట్లైంది. దీనిపై టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై నిరసనగా బయలుదేరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీస్ చుట్టూ వంశీ కారులో తిరుగుతున్నారని వారు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్దే పోలీసులు ఉన్నా పట్టించుకోవట్లేదని ఆరోపణలు గుప్పించారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, ఐదు వాహనాలు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. 50 నుంచి 60 మంది దాడిలో వైసీపీ నేతలు పాల్గొన్నారని తెలిపారు.  అంతకుముందు ప్రెస్‌మీట్‌లో టీడీపీ అగ్రనేతలపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. తెలుగుదేశం పార్టీ నేతలు ఖండించారు. వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో వంశీ వర్గీయులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు.

గన్నవరం ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సైకో సీఎం అండతోనే వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లో దాడి జరిగిందన్నారు. వంశీ రౌడీలు పట్టపగలే టీడీపీ కార్యాలయంలోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అరాచకం సాగుతోందన్నారు. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టాలని.. తల పొగరు అణచివేస్తామని అచ్చన్న హెచ్చరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gannavaram
  • krishna dist
  • tdp
  • tdp office

Related News

Yarlagadda Venkatrao Gann

Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ

Yarlagadda VenkatRao : విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో బుధవారం ఉదయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

  • Vkr Prajadarbar

    Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

Latest News

  • Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

  • Rupe Value : రూపాయి మరింత పతనం

  • SIP Investments : పదేళ్లలో రూ.కోటి కావాలా? నెలకు ఎంత సిప్ చేయాలో తెలుసా..!

  • ‘Hilt’ Leakage : ‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానాలు

  • IndiGo Flight Disruptions : రెండో రోజు కూడా విమానాల రద్దు.. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల గందరగోళం

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd