Anocovax: దేశంలో తొలిసారిగా జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్..!
దేశంలో మొదటిసారిగా జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకువచ్చారు. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ హర్యానకు చెందిన ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ డెవలప్ చేసిన అనోకోవాక్స్ ను కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ప్రారంభించారు.
- By hashtagu Published Date - 05:30 AM, Fri - 10 June 22

దేశంలో మొదటిసారిగా జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకువచ్చారు. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ హర్యానకు చెందిన ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ డెవలప్ చేసిన అనోకోవాక్స్ ను కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ప్రారంభించారు. అనోకోవాక్స్ జంతువుల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన వ్యాక్సిన్. క్రియారహితం చేసిన సార్స్ కోవ్ 2 డెల్టా వ్యాక్సిన్. అనోకోవాక్స్ జంతువుల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో డెల్టా ఓమిక్రాన్ వేరియంట్స్ కు చెక్ పెట్టవచ్చని ICAR ప్రకటించింది.
క్రియారహితంచేసిన సార్స్ కోవ్ యాంటిజెన్ తోపాటు ఆల్ హైడ్రోజెల్ ఈ వ్యాక్సిన్ లో సహాయక చర్యగా ఉంటుంది. ఇది కుక్కలు,సింహాలు, చిరుత పులులు, ఎలుకలు, కుందేళ్లకు సురక్షితమైందిగా తయారీ సంస్థపేర్కొంది. సొంత వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం పెద్ద విజయమని కేంద్రమంత్రి అన్నారు. అనోకోవాక్ తోపాటు కాన్ కోవ్ 2 ఎలిసా కిట్ కూడా మంత్రి ప్రారంభించారు. దీంతో కుక్కల్లో సార్స్ కోవ్ 2 యాంటీ బాడీలను గుర్తించవచ్చు.