Tea: టీ తెచ్చెను కోపం… ప్రాణాలు గాల్లో కలిసెన్!
మనుషుల్లో ఆవేశాలు పెరిగిపోయాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇలానే ప్రవరిస్తున్నారు. చిన్న గొడవలే చిలిచిలి గాలివానలా తయారవుతున్నాయి.
- Author : Anshu
Date : 09-03-2023 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
Tea: మనుషుల్లో ఆవేశాలు పెరిగిపోయాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇలానే ప్రవరిస్తున్నారు. చిన్న గొడవలే చిలిచిలి గాలివానలా తయారవుతున్నాయి. ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పతున్నారు. మరికొందరు మాత్రం హత్యలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలు ప్రస్తుతం నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వేడి వేడి టీ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుకోట జిల్లాలో జరిగింది. మలైక్కుడి పట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్య న్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్, కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది.
ఈ క్రమంలోనే కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె కోడలిని మందలించింది. దీంతో ఒక్కసారిగా కోడలు ఆగ్రహించింది. ఇక ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు.