HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Anganwadis On War Path In Andhra Pradesh

Andhra Anganwadis: అడ్డంకులు ఉన్నా ఆందోళ‌న‌ల‌కు రెడీ.. ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగుల ఢీ

ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌లు ప్రభుత్వానికి చికాకు క‌లిగిస్తున్నాయి. నూత‌న డీజీపీకీ స‌వాలుగా మారాయి.

  • Author : Hashtag U Date : 22-02-2022 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
anganwadi Protest
anganwadi Protest

ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌లు ప్రభుత్వానికి చికాకు క‌లిగిస్తున్నాయి. నూత‌న డీజీపీకీ స‌వాలుగా మారాయి. ఉద్యోగుల ఉద్యమంలో సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఊరేగింపులు, ఆందోళ‌న‌లు చేయ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుండ‌డం, వాటిని ధిక్కరించి ఉద్యోగులు తాము అనుకున్నది చేస్తుండ‌డం ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది.

ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షలాది మంది ఉద్యోగులు విజ‌య‌వాడ చేరుకొని భారీ ప్రద‌ర్శన చేయ‌డం ఇటీవ‌ల కాలంలో చ‌ర్చనీయాంశంగా మారింది. పోలీసులు అడ్డంకులు క‌లిగించినా మారువేషాల్లో విజ‌య‌వాడ చేరుకోవ‌డం దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యేలా చేసింది. మ‌ళ్లీ అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, హెల్పర్స్ కూడా కూడా ఇదే ప‌ద్ధతుల‌ను అనుస‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

జీతాల పెంపుపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్వాడీ కార్యక‌ర్తలు జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యాల వ‌ద్ద ఆందోళ‌న చేయాల‌ని నిర్ణయించారు. పోలీసులు ఎక్కడిక‌క్కడ వారిని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల బ‌స్సుల నుంచి దించివేశారు. అయినా వారు వేరే మార్గాల్లో జిల్లా కేంద్రాల‌కు చేరుకున్నారు. ఇంకొన్ని చోట్ల సాధార‌ణ మ‌హిళ‌ల మాదిరిగా ప్రయాణించి క‌లెక్టరేట్ల వ‌ద్దకు వ‌చ్చారు. పోలీసుల‌ను ఏమార్చారు.

నిర్బంధాలు, బారికేడ్లను అధిగ‌మించి ఆందోళ‌న‌లు చేశారు. ప్రతి జిల్లాలోనూ అనుకున్న విధంగానే క‌లెక్టరేట్ల వ‌ద్ద ధ‌ర్నాలు జ‌రిగాయి. అంగ‌న్వాడీలు వాడీవేడిగా ఉద్యమించ‌డం ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ఇలాంటి త‌ర‌హా ఉద్యమాల‌కు ఇది మార్గం చూపింద‌న్న డిస్కష‌న్స్ న‌డుస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • anganwadis
  • anganwadis protest
  • ongole collectorate

Related News

Andhra Pradesh Dwcra Womens

AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..

ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద వివాహాల కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్

  • Ap Home Minister Vangalapud

    Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

Latest News

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd