Covid 19: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు
Covid 19: ఏపీలో కరోనా వైరస్ మరొకసారి విజృంభిస్తోంది. అనంతపురం జిల్లాలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది.
- By Kavya Krishna Published Date - 10:41 AM, Thu - 5 June 25

Covid 19: ఏపీలో కరోనా వైరస్ మరొకసారి విజృంభిస్తోంది. అనంతపురం జిల్లాలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. పాతూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమె స్వచ్చంధంగా వైద్యులను సంప్రదించగా, నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు. అయితే, బాధిత మహిళ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండేందుకు ఆసక్తి చూపింది. తాను ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటానని ఆమె వైద్యులకు తెలియజేసినట్లు సమాచారం.
Mahabali Frog: ఏమిటీ మహాబలి కప్ప..? సంవత్సరానికి ఒకేసారి భూమిపైకి వచ్చే అద్భుత జీవి..!
ఇదిలా ఉండగా, ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించే యోచనలో ఉన్నారు. స్థానికులందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. జిల్లాలో మొదటి కేసుగా నమోదైన ఈ ఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
RCB Official Statement: తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆర్సీబీ!