Titanic Movie: టైటానిక్ సినిమాను తలపించే ఘటన.. సముద్రంలో చిక్కుకున్న 400 మంది ప్రయాణికుల ఓడ!
టైటానిక్' సినిమాను తలపించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. 400 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ఓడ సముద్రంలో చిక్కుకుంది. మధ్యదరా సముద్రంలో ఇది జరిగింది.
- By Anshu Published Date - 10:20 PM, Mon - 10 April 23

Titanic Movie: ‘టైటానిక్’ సినిమాను తలపించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. 400 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ఓడ సముద్రంలో చిక్కుకుంది. మధ్యదరా సముద్రంలో ఇది జరిగింది. 400 మంది వలసదారులు లిబియా నుంచి అక్రమంగా దేశం దాటేందుకు ఓడలో ప్రయాణిస్తున్నారు. అయితే గ్రీస్, మాలా మధ్యలో సముద్రంలో ఒక్కసారిగా ఓడ ఆగిపోయింది. ఇంధనం అయిపోవడంతో సముద్రం మధ్యలో ఓడ ఒక్కసారిగా నిలిచిపోయింది.
ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఓడ కెప్టెన్ ముందుగానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఓడలోని ప్రయాణికులు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. దీంతో ప్రయాణికులు అలారం ఫోన్ అనే సపోర్ట్ సర్వీన్‌ను సంప్రదించగా.. సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ఓడకు సమీపంలో మరో రెండు ఓడలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే వారికి సమాచారం అందించారు. ఇంధనం అయిపోయిన ఓడకు వెంటనే ఇంధనం సరఫరా చేయాలని కోరారు.
ఇక ఓడలోని వలసదారులను రక్షించేందుకు డిసియోట్టి అనే ఓడలను ఇటాలియ్ కోస్ట్‌గార్డ్ పంపించింది. ఇక యూరోపియన్ యూరోయిన్ కూడా వలసదారులను రక్షించాలని కోరింది. ప్రస్తుతం ఓడ అడుగు భాగంలోకి నీళ్లు రావడంతో వలసదారులు ఓడ పైభాగంలోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఓడ గాలికి కొట్టుకుపోతున్నట్లు అలారం ఫోన్ సర్వీస్ తన ట్విట్టర్‌లో పేర్కొంది. గతంలో ఇలాగే ఆఫ్రికా నుంచి ఇటలీకి కొంతమంది వలస వెళుతుండగా.. రెండు ఓడలు ట్యునీషియా సమీపంలో మునిగిపోయాయి. దీంతో 22 మంది మరణించారు. అలాగే కొంతమంది గల్లంతయ్యారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి 440 మంది అప్పట్లో కాపాడారు. ఇప్పుడు అలాగే వలసదారులతో వెళ్తున్న మరో ఓడ సముద్రంలో చిక్కుకోవడం ఆందోళనకరంగా మారింది. ఓడలోని వారిని కాపాడేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.దీని కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు.