Casino Probe: గుడివాడ క్యాసినో పై పోలీసుల విచారణ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో విచ్చలవిడిగా కోడిపందల నిర్వహాణ, గుండాట లాంటి జూదక్రీడలు జరిగాయి. ఇవి ప్రతిఏటా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
- By Hashtag U Published Date - 11:30 AM, Thu - 20 January 22
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో విచ్చలవిడిగా కోడిపందల నిర్వహాణ, గుండాట లాంటి జూదక్రీడలు జరిగాయి. ఇవి ప్రతిఏటా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఏపీకి గోవా కల్చర్ వచ్చింది. మంత్రి కొడాలి నాని ఇలాఖాలో ని ఓ కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో జూదం విచ్చలవిడిగా జరిగింది.
భారీ ఎత్తున పంక్షన్ హాల్ లో దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఈ జూదాన్ని మంత్రి కొడాలి నాని నిర్వహించారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పటికి ఆ మూడు రోజులు పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే తాజాగా దీనిపై కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చర్యలు చేపట్టారు. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ స్పందించారు. నూజువీడు డీఎస్పీ శ్రీనివాసులును విచారణ చేపట్టాలని ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ప్రత్యేక బృందంతో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విచారణ ప్రారంభించనున్నారు. మరి ఈ విచారణలో అసలు క్యాసినో కింగ్ పిన్ ఎవరు అనేది తెలుస్తారో లేదా ఎవరో ఒకరిపై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటారో వేచి చూడాలి.
Tags
Related News
Pawan Kalyan: కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో టీడీ-జేఎస్-బీజేపీ కూటమి విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.