Al Qaeda : భారత్ లో ఆత్మహుతి దాడులు చేస్తాం…హెచ్చరికలు జారీ చేసిన అల్ ఖైదా..!!
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.
- By hashtagu Published Date - 10:35 PM, Tue - 7 June 22

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యాఖ్యలను ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించాయి. తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది. ఢిల్లీ, ముంబయి, యూపీ, గుజరాత్ లో ఆత్మాహుత దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసం ఈ దాడులు అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ రిలీజ్ చేసింది.
మా మహ్మద్ ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలను, మా పిల్లల దేహాలను పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవంలేని వారిని పేల్చేస్తాం. కాషాయ టెర్రిరిస్టులు ఇక మరణం కోసం ఎదురుచూడాలంటూ లేఖలో పేర్కొంది అల్ ఖైదా.