Fire In Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
ఇటీవల తరుచుగా విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి.
- Author : Balu J
Date : 14-09-2022 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల తరుచుగా విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు గాయపడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానం ప్రమాదం బారిన పడింది. ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చిన్ రావాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (IX-442, VT-AXZ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా రన్‌వేపై మంటలు చెలరేగి, విమానం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది.
ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. విమానం నుండి పొగలు రావడం తో ప్రయాణీకులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నుండి ఖాళీ చేయించారు. మొత్తం 147 మంది ఉన్నట్టు సమాచారం. టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వారిని మరో విమానంలో గమ్యస్థానాలకు తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్ టీం ఇంజన్-2 లోపం ఉన్నట్టు గుర్తించారు.
Just in :
– Passengers evacuated via slides after smoke on Air India Express Muscat-Cochin flight IX-442, VT-AXZ.
– There were 141 passengers plus 6 crew onboard and all are safe.
@FlyWithIX pic.twitter.com/ufkvbk36hI
— Tarun Shukla (@shukla_tarun) September 14, 2022