HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Agricultural Drone Sprayer Delivery By Harish Rao

Drone Sprayer: వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్స్ పంపిణీ!

భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

  • Author : Balu J Date : 21-02-2023 - 8:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao review corona
Harishrao

సిద్ధిపేట 21 ఫిబ్రవరి 2023: భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. భూమి, ఆరోగ్యం మనిషి ఆరోగ్యానికి భూమికి అవినాభావ సంబంధం ఉంటుంది. భూమి బాగుంటే మనిషి బాగుంటాడు. రసాయనికి ఎరువులు వాడితే సమాజంలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. క్యాన్సర్ వస్తే ఆర్థికంగా, శారీరకంగా పూర్తిగా దెబ్బతింటారు. భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ ఆవరణలో భూమిత్ర మన తడిచెత్త- మన సేంద్రీయ ఎరువు- మన నేల సిద్ధిపేట బ్రాండ్ తో జీవ సంపన్న సేంద్రీయ ఎరువులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాలం మారిందని, ఎనకట రెండు పూటలా అన్నం తినడం ఉండేదని, ఈ రోజుల్లో పేదలు రెండు పూటలా అన్నం తింటుంటే, డబ్బున్న వాళ్లు గంజి, గట్కా, రొట్టెలు తింటున్నారని, కానీ రసాయనిక ఎరువులతో తిన్న ఆహారంతో బీపీ, షుగర్ లతో పరిస్థితి రివర్స్ అయిపోయి తిరోగమనం వైపు మనిషి పయనిస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు.

భూమిత్ర సిద్ధిపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలైన 41 వేల 322 మంది విజయమని, ఇదంతా పట్టణ ప్రజలు నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతో సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.
సిద్దిపేటలో 34 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నదని, ఇందులో తడి చెత్త 27 లక్షల మెట్రిక్ టన్నులు, 4 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, మిగతాది హానికరమైన చెత్త వస్తుందని మంత్రి వివరించారు.

తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీ సైక్లింగ్ కు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సిమెంట్ కర్మాగారం కు విక్రయిస్తున్నట్లు, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్ గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనంగా అభివర్ణించారు. ప్రతి నెల 4500 కిలోల గ్యాస్ తయారు చేస్తున్నామని, అలాగే ప్రతి నెల 100 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతున్నదని, గ్యాస్ ద్వారా 3 లక్షలు, ఎరువుల ద్వారా 7.3 లక్షల ఆదాయం, పొడిచెత్త ద్వారా 11.30 లక్షల ఆదాయం మొత్తం 21 లక్షల పైగా ఆదాయం సిద్దిపేట మున్సిపల్ కు సమకూరుతుందని మంత్రి చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ ఒక్కో మొక్కకు రెండున్నర కిలోల సేంద్రీయ ఎరువులు వాడకం మంచిదని చెప్పుకొచ్చారు.

వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ పంపిణీ
మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. వ్యవసాయ పరికరాలు చిన్న, సన్న కారు రైతులకు అందుబాటులో తేవడానికి, తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వడానికి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హెరింగ్ సెంటర్స్-వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 21 మండల సమాఖ్యలు – రాయపోల్, సిద్ధిపేట అర్బన్ మినహా సీహెచ్ సీలను రూ.3.05 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 75 శాతం, ఏం.ఎస్. సొంత నిధులు రూ.2.09 కోట్లు మరియు 25 శాతం ఎస్.ఆర్.ఎల్.ఎం రూ.96 లక్షలు వెచ్చించినట్లు వివరించారు.
CHCలో ప్రధాన పరికరాలు: ట్రాక్టర్, ప్యాడి బేలర్, రోటో వేటర్, కల్టీ వేటర్, తైవాన్ స్ప్రేయర్స్, ప్యాడి క్లినర్లు కం.లిప్టర్, పవర్ వీడర్, మల్టీ కాటస్ షెడ్డర్, 3 హెచ్ పీ ఇంజన్ మౌంటెడ్ స్ప్రేయర్, ట్రాలీ, డోజర్, టార్పెలిన్ మొదలగు పరికరాలు. జిల్లాలోని 4 మండలాల్లో డ్రోన్ స్ప్రేయర్లు ఏర్పాటుకు కోహెడ, నారాయణరావుపేట, బెజ్జంకి, గజ్వేల్ ప్రణాళిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు కోహెడ మండల సమాఖ్యకు రూ.9.63 లక్షలు అందించారు.

అగ్రికల్చర్ డ్రోన్ వల్ల కలిగే ప్రయోజనాలు:
రైతులు మందు పిచికారి చేస్తున్నప్పుడు ఎకరాకు 120 లీటర్ల వరకూ నీరు వాడుతున్నారు. దీనితో మందు శాతం తగ్గిపోతుంది. పిచికారి చేస్తున్నప్పుడు శరీరం పై పడటం, వాసన పీల్చడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిత్యం 3 నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువగా పిచికారి చేయలేకపోవడం లేబర్ సమస్య. ఒక ఎకరాకు లీటరు ఆపైన మందు కొట్టడం ఆర్థిక భారం పెరుగుతున్నది. అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్స్ వలన పంట పై భాగంలో కొట్టడం వలన పిచికారి చేసిన మందు పూర్తి శాతం పంటపై పడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు తావులేదు. గంటకు 10 ఎకరాల వరకూ పిచికారి చేసే అవకాశం ఉంది. ఒక ఎకరాకు లీటరుకు బదులుగా 700 గ్రాముల మందు పిచికారి చేయడానికి సరిపడుతుంది.

మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Drones
  • farmers
  • harish rao
  • siddipet

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd