Lemon Seller: ట్రెండ్ అవుతోన్న లెమన్ సోడా..!! వైరల్ వీడియో.!!
సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. అలాంటి కొన్ని ట్రెండింగ్స్ వల్లే చాలా మంది సెలబ్రిటీల స్థాయికి వెళ్లారు.
- By Hashtag U Published Date - 11:54 AM, Tue - 12 April 22

సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. అలాంటి కొన్ని ట్రెండింగ్స్ వల్లే చాలా మంది సెలబ్రిటీల స్థాయికి వెళ్లారు. ఈ మధ్య కాలంలో కచ్చా బాదం అమ్ముకునే వ్యక్తి…తన వ్యాపారం కోసం ఓ పాటను క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియలో పోస్టు చేయడంతో…విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఇలాంటి ఉదాహరణలు ఇంటర్నెట్ లో ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు నిమ్మకాయ సోడా అమ్ముతున్న వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…రోడ్డుపై లెమన్ సోడా అమ్ముకునే వ్యక్తి……తాను సోడాను రెడీ చేసే విధానం అక్కడున్నవారి ఆకట్టుకుంది. నిమ్మకాయలను గాల్లోకి విసిరి…డ్రింక్స్ గురించి వివరిస్తూ బ్లాక్ సాల్ట్ కలపడం….చూపరులను కడుపుబ్బా నవ్వించాడు. తండా పాతో ముగించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంతో 9 లక్షలకు పైగా లైకులు…కామెంట్స్ వచ్చాయి. లెమన్ సోడా అమ్మే ఈ వీధి వ్యాపారి హట్కే విధానంతో తెగ వైరల్ అవుతున్నాడు.