Bandi Sanjay: జైలు నుంచి ‘బండి’ విడుదల
బీజేపీ చీఫ్ బండి సంజయ్ బుధవారం సాయంత్రం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్‌తో పాటు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా ఉన్నారు.
- By CS Rao Published Date - 10:21 PM, Wed - 5 January 22

బీజేపీ చీఫ్ బండి సంజయ్ బుధవారం సాయంత్రం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్‌తో పాటు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా ఉన్నారు.వాళ్ళను పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ ఆహ్వానించింది.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. జీఓ 317ను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసమే నేను జైలుకు వెళ్లాను.. కోవిడ్-19 నిబంధనల ప్రకారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు తొమ్మిది సార్లు లాఠీచార్జి చేశారు” అని సంజయ్ తెలిపారు.
ప్రభుత్వం జిఒ 317ను సవరించకుంటే మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, ఉద్యోగుల సంఘాల అధ్యక్షులను నమ్మవద్దని సంజయ్ కోరారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం జైలుకు పంపుతుందని అన్నారు.
తనకు సంఘీభావం తెలిపినందుకు ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, పార్టీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
Live : https://t.co/8pFVae8N3d
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 5, 2022